"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 83,వ,బాగం)- "నాగమణి రావులపాటి "
 పల్లవించిన ప్రణయ బంధం కుసుమించి  విరి
తేనెలు కురిపించగా మదిలో మెదిలే తీయని
భావాలు కోటి వీణలు పలకగా విరహపు అలలు
ఎగిసిపడగా మనసైన వాడిని కలుసుకోవాలనే
తలపులు తొందరలు చేయగా వెంటనే డ్రైవర్ కు
కాల్ చేసి తన కారులో పయనమయ్యింది కుసుమ.!!
ముందుగా వేణు ఇంటికి వెళ్ళింది, కుసుమ
వేణు అమ్మా నాన్నలకు శుభలేఖ ఇచ్చి 
భోజనం కానిచ్చి రాహుల్ కు ఫోన్ చేసింది...
రాహుల్ వచ్చి కుసుమను ఇంటికి తీనుకుని 
వేళ్ళాడు.........!!
ఆరోజు సినిమా థియేటర్ లో చూడటమే మళ్ళీ
ఇప్పుడే కుసుమా రాహుల్ వాళ్ళ అమ్మగారు
ఒకరిని ఒకరు ఆప్యాయతలు, నిండిన ,హృదయంతో
పలకరింపులు, పలకరించుకున్నారు........!!
ఇంతలో రాహుల్ వాళ్ళ అక్కా బావా కూడా
వచ్చారు... హాయ్ కుసుమా ఎలా వున్నావు అని
నవ్వుతూ పలకరించింది, రాహుల్ వాళ్ళ అక్కయ్య
బాగున్నానండీ, అని తనూ నవ్వుతూ సమాధానం
చెప్పింది కుసుమ.............!!
తన హేండ్ బ్యాగ్ లోంచి శుభలేఖ దానితో పాటు
చిన్న కుంకుమ భరిణ తీసింది, కుసుమ....
రాహుల్ వాళ్ళ అమ్మగారికీ అక్కగారికి బొట్టు
పెట్టి శుభలేఖ అందించింది...............!!
ఆంటీగారు మీరూ అంకుల్ సకుటుంబ
సపరివారంగా మా చెల్లి పూర్ణిమ వివాహానికి
విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలి, తప్పకుండా
రండి అని విన్నవించింది...అలాగే కుసుమా
రాహుల్ అంతా చెప్పాడు............!!
మీ ఇద్దరికీ రాసిపెట్టి వుంది, అందుకే ఎన్ని
ఆటంకాలు కలిగినా, మీరిద్దరికీ ,వివాహం జరిగి
తీరుతుంది... నాకు మీ అంకుల్ గారికీ చాలా
సంతోషంగా వుంది ..........!!
ఎంత తొందరగా ఈ ఇంటిలో కోడలిగా
అడుగు పెడతావా, అని, ఎదురు చూస్తున్నాము
అని ఆనందం బాష్పాలు నిండిన కనులతో
కుసుమ తో అన్నారు, రాహుల్ అమ్మగారు......!!
త్వరలోనే, మీ ఆశ నెరవేరుతుందిలే ,ఆంటీగారు
నేను, హాస్పిటల్ కు వెళ్ళి ,అంకుల్ ను పలకరించి
మా ఫ్రెండ్ గీత ఇంటికి వెళ్తాను.. అని వారివద్ద
సెలవు తీసుకుని రాహుల్ తో హాస్పిటల్ కు
వెళ్ళింది, కుసుమ (సశేషం)...........!!

కామెంట్‌లు