చిట్టి చేతులు;-డా.నీలం స్వాతి చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
//చిట్టి చేతులు 
మట్టి తాకెను 
మొక్కలను నాటగా//

మబ్బుపట్టి, వాన కురియగా
నేలతల్లి పరవశించెను...

కొమ్మ కొమ్మ పిందె లేసెను
మల్లె తోట కాపు కాసెను...

చింత చెట్టు చిగురువేసెను
బీర తీగలు పందిరల్లెను...

నీరు పోయగ, పూలు పూసెను
ఎరువు నేయగ, పండ్లు కాసెను...

తియతియ్యని విందు కోసం 
తేనెటీగలు చుట్టుముట్టెను...

విరగ కాసిన వనం లోకి
చిన్నా- పెద్దా పరుగు తీసెను...

పూలు కాయలు పట్టుకొచ్చెను,
కాయమంటూ దండమెట్టి
దైవానికి కానుకిచ్చెను...కామెంట్‌లు