తాత చేతి కర్ర;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కర్రేగా అని 
చులకనగా చూడకండి 
దేని విలువ దానికే ఉంటుంది... 
ఖరీదైనదేమీ కాదుగా అని 
తీసి పడేయకండి,
భవిష్యత్తులో బాగా
ఉపయోగపడుతుంది...
జాగ్రత్తగా చూసుకుంటూ...
భద్రంగా దాచుకోండి....
క్షణం తీరిక లేక కష్టపడి,
సంసార నావను ఒడ్డు చేర్చి,
సంతతిని వృద్ధి పరిచి,
కష్టసుఖాల, లాభనష్టాల
రుచులను స్వతహాగా అనుభవించి, 
సత్తువ లేని 
శరీరాన్ని మోస్తూ, 
పెరిగిన వయసంత
అనుభవాలను మూటగట్టుకున్న 
మన ఇంటి పాలేరుకు 
మూడో కాలు 
ఈ చేతి కర్రే...
చేతగానితనాన్ని 
వేక్కిరిస్తూ వెర్రి 
కుర్రతనం విర్ర 
వీగి పైన పడితే 
ఆయుధమై పోరాడేది...
సొమ్ములు కూడగట్టి 
స్పృహ లేక నిద్రపోతే 
సైనిక దళమై లంకంత కొంపను కాపాడేది...
అరుగు మీద కూర్చొని
ఆరాలు తీస్తూ 
ఊరి పెద్దయి 
పెత్తనం చేసేది...
పళ్లెంలో అట్టును 
ఎత్తుకు పోవాలని
ప్రయత్నించిన 
దొంగ కాకికి 
మొట్టికాయ వేసేది...
కుప్పిగంతులేస్తున్న
కోతిమూకల అల్లరిని 
కట్టడి చేసేది....
వేళ కాని వేళ చప్పున 
లేచి ఎక్కడికి పోవాలన్నా తోడుగా
సాయమోచ్చేది...
ఉన్నచోట ఊసుపోక
కాలు కాలిన పిల్లిలా 
ఊరంతా తిరిగొచ్చేది....
మసకబారిన కళ్ళకు
దారి పరుస్తూ
పాదాలతో 
పరుగులు ముందుకు
పెట్టించేది...
అయినవారి నోట 
మాట పడనీక 
వృద్ధాప్యంలో
స్వాభిమానాన్ని 
కాపాడేది...
కాలం చెల్లి కన్ను 
మూసేదాక 
ముసలోడికి 
కాపలాగా ఉండేది...
ఈ చేతి కర్రే... 
బుర్ర మీసాల తాత 
చేతి కర్రే...



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం