బాలు పాట;-డా. నీలం.స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కవి పట్టిన కలం ఇక అక్షరాల 
సాహసాన్ని చేయబోనంది...
నీ పెదవి ఆ పదములను పలకదని తెలిసి...
సరిగమల గానం ఆశ్చర్యంగా మూగబోయినది...
అరుదైన గళం గగనానికి ఏగెనని తెలిసి...
తియ్యని రుచిగల తెనుగు చేను ఇక పండబోనంది... 
నీ స్వరాల చినుకులు తనదాక చేరవని తెలిసి...
మధురమైన మోహన రాగం ఇక పల్లవించనంది...
నీ గంధర్వ గాత్రం తనకు సాయం 
రాదని తెలిసి...
జాడను తలచి బాష
భావోద్వేగానికి గురి అయినది...
బహుముఖ ప్రజ్ఞాశాలి
 బహు దూరాలకు పయనమయ్యే
 యోచనలో వున్నాదని తెలిసి...
పల్లవుల పూదోట ఇక పువ్వులను పూయబోనంది...
చిరునవ్వుల రాగం చితికేగెనని తెలిసి...
చెమరిల్లి చరణం చిన్నబోయినది...
భావ స్పష్టత ఇక అసాధ్యం కానున్నదని తెలిసి...
పురిటి బాధలను తలచు కొనగా 
పుత్రశోకాన కళామతల్లి తల్లడిల్లుతుంది...
అఖండ శిఖరాలను అలవోకగా తాకిన మాను
నేల కొరెగనని తెలిసి...
చీకటైన సంగీత లోకం 
ఇక  వేకువను చూడబోనంది...
గమ్యస్థలాలకు గానాన్ని, గాయకులను 

నడిపించే పెద్ద దిక్కులేడని తెలిసి...కామెంట్‌లు