జ్ఞానశిఖరం(బాలగేయం) ;-పి. చైతన్య భారతి 7013264464
భారత దేశం నాదేశం
భాగ్యవిధాతయె నాదేశం
ప్రపంచ పటమున  సందేశం
ప్రవచించెనురా నాదేశం!

ప్రకృతి వనరులే అపారం 
నదీనదాలతొ  సింగారం 
పాడిపంటలకు ఆధారం 
భాగ్యసీమయే నాదేశం 

ఉపనిషత్తులతత్వముతో 
వేద కావ్యాల  సారంతో 
శాంతి స్థాపనలమార్గంతో 
జ్ఞాన శిఖరమే  నాదేశం 

భాషాసంస్కృతులనిలయమై 
పరమఋషులకు స్థానమై 
జగతియంతా  దీప్తిమయమై 
తేజరిల్లేను  నాదేశం 

ధీరపురుషుల జన్మస్థలం 
మహామహుల పుణ్యస్థలం 
ఖండించేను దాస్యశృంఖలం 
ఖ్యాతిబడసెను  నాదేశం 


కామెంట్‌లు