రాత మార్చుకుందాం!; -పి.చైతన్య భారతి 7013264464
-సభరనమయవ మసజసతతగ(వ్యస్తాక్షరి కవిత)
=================================

అ స మర్థ ప్రభుత్వ పాలనలో ప్రజలు 
లా భ ము నొందలేక విసుగెత్తారు.
వి ర క్తితోనున్న నిరుద్యోగ యువత.
ఒ న గూరనినిష్ప్రయోజనపథకాలెన్నో,
స మ స్యలపై దృష్టిసారించలేనివారు 
మా య మాటలతో మభ్యపెట్టేవారు 
అ వ కాశవాద రాజకీయనాయకులు. 

మ మ తనుఒలకబోయు ఓట్లకొరకు 
ప్ర స న్నంచేసుకునే కపటులనమ్మకు.
నై జ o మార్చుకోని నాయకులకు 
అ స లైన సమాధానమే నీ ఓటు.
వె త లు బాపే నేతకే మన ఓటేసి 
రా త  మార్చుకుందాం ప్రజలారా! 
గ గ నమేమి కాదులే మనసుంటే.


కామెంట్‌లు