నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(మణిపూసలు);-పి. చైతన్య భారతి 7013264464

1. 
గిరిజనులా తోటలోను 
పుష్పమొకటీ విరిసేను
లోకమెల్ల మురిసిపోయె
పరిమళాలు వెదజల్లెను 
2.
భారతమాత సిగలోను 
ముదముతోడ అలరించెను 
సగర్వoగా  స్త్రీ జాతి 
స్పూర్తితోడ నుప్పొంగెను 
3.
రాష్ట్రపతి పీఠంబును 
ఆదివాసి మహిళగాను
ఒక్కోమెట్టెక్కుతూ 
అధిరోహించె ఘనమేను. 
4.
తనవారిని కోల్పోయెను 
విషాదాలు దిగమింగెను 
మంత్రిగాను పనిచేసి 
గవర్నరుగ ఎదిగెను. 
5.
ఒడిశాలొ మారుమూలను 
మాణిక్యం జన్మించెను 
ద్రౌపది ముర్ముగారు
ఆదివాసీ తెగలోను 
6.
ఉపాధ్యాయ వృత్తిలోను 
జీవితామరంభించెను
రాజకీయరంగంలో 
ఉన్నతంగా ఎదిగెను. 
7.
ఏకైక  ఆదివాసిగ
చరిత్ర  సృష్టించేనుగ
మహిళా గిరిజన శక్తి 
ఉత్తమ నాయకురాలుగ
8.
వాడవాడ పులకించెను 
వసుమతీ విస్తుపోయెను 
పడతులెల్ల మేలుకొని 
చైతన్యం నింపుకొనెను.
9.
దేశ ప్రథమ పౌరురాలు 
అందుకొనుము వందనాలు
సమస్యలను గుర్తించి 
ఎక్కుపెట్టూ  బాణాలు 
 

కామెంట్‌లు