బాలకా(బాలగేయం);-చైతన్య భారతి పోతుల 7013274464
నడవడికే మూలధనం 
నలుగురితో మంచితనం 
ఉండాలోయ్ బాలకా !
తిరుగులేదు  నీకికా !

గురువులను అనుసరించు 
విలువలను స్వీకరించు 
రారండోయ్  బాలకా !
బతుకు మారు నీదికా !

దివ్యమైన సంస్కారం 
ఉన్నతికి  ఆస్కారం 
పొందాలోయ్ బాలకా!
భవితవ్యం  నీదికా !

ప్రకృతియే అద్భుతం 
పరికించు ఆసాంతం 
చేయాలోయ్ పరిశీలన!
ప్రశాంతమే ఇలలోనా !


కామెంట్‌లు