చెలిమి పరిమళం ;- కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్య పర్యవేక్షకుడు,జాతీయ కీటక జనిత నియంత్రణ కేంద్రం సికింద్రాబాద్, 8555010108.
పరస్పర సహకార సమన్వయం నెయ్యం
మనీ సంబంధం కాని మైత్రి బంధం పదిలం
స్వచ్ఛమైన దోస్తికి కేరాఫ్ గా నిలిచే వైనం
కరిగే కాలం కాదది తరగని సంపద స్నేహం !

కృష్ణ కుచేలుని స్నేహం సదా మార్గదర్శనం
మైత్రికి ఆర్థికాంతరాలు కాలేవు అడ్డుగోడలు
స్నేహం కోసం సోదరులపై పోరు చేసే కర్ణుడు
గుభాలించు గులాబీ చెలిమి పరిమళం !

చెలిమి బలిమి లేనిదే సాగదు సరదా జీవనం
స్వలాభాపేక్ష లేని జ్ఞాన సుగుణ అమృత కలశం 
ఎండకు నీడై వానకు గొడుగై చేదోడు వాదోడై 
వెన్నంటి వుండే రక్షణ కవచం గాఢమైన నేస్తం!

అదిగదిగో మదిలో విత్తిన స్నేహ బీజం                                                       
ఇంతింతై ఆకాశమంత ఎదిగే ఆనంద వృక్షం 
ఆపద్బాంధవ సుమాలు వికసించే మైత్రి వనం
స్నేహ పూర్వక హృదయం మధురాతి మధురం !
(అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో)


కామెంట్‌లు