సూపర్ కెటిల్ ; సమ్మోహనాలు (889-899);-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
కెటిలమ్మ టీ  కెటిలు 
కెటిలున డికాషనులు 
డికాషను మరుగుతూ సువాసన ఓ వనజ !

పాలతో కలగలిసి 
కలపగా రుచి తెలిసి 
తెలిసివదలగ లేరు టీ కప్పు ఓ వనజ !

జోరుగా వానల్లు 
వానలో టీ థ్రిల్లు 
థ్రిల్లుగా వెచ్చగా సేవించ ఓ వనజ !

సందులో టీ బంకు 
బంకులేకను జంకు 
జంకు కద తెల్లారి టీ కాఫి ఓ వనజ !

తలనొప్పి వదిలించు 
వదిలించి పని పెంచు 
పెంచుతూ ఉత్పత్తి సాధించు ఓ వనజ !

పెట్టుబడి స్వల్పమ్ము 
స్వల్పమగు సమయమ్ము 
సమయమే సాధించు ఉపాధిని ఓ వనజ !

చిన్న వ్యాపారులకు 
వ్యాపార చురుకునకు 
చురుకుగా ఛాయినే కోరుదురు ఓ వనజ !

ఉభయ సంజెలలోను 
సంజెకే వెలుగౌను 
వెలుగుకుంపటి స్టవ్వు వేడుకగ ఓ వనజ !

డబుల్ రొట్టెలు అమ్మి 
అమ్మి దోశెలనమ్మి 
దోశె ఇడ్లీ  పూరి ఆమెపని ఓ వనజ !

జోరుగా వానలో 
వాన ఇబ్బందిలో 
ఇబ్బంది వ్యాపార మూతగా ఓ వనజ !

కామెంట్‌లు