జ్ఞానపీఠపురస్కారగ్రహీత , డా.సింగిరెడ్డినారాయణరెడ్డి(సినారె) 91 వ జయంతి-పద్యాంజలి"!!!*;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి:- 6300474467
 01.
సీ.
అఖిలభారతమందునత్యున్నతంబైన
జ్ఞానపీఠమునొందిఖ్యాతివడసి
బహుముఖప్రజ్ఞతోపలుకావ్యములువ్రాసి
పాఠకాళికినిచ్చిభద్రముగను
సభలలోసందర్భసరసవాక్కులుపల్కి
రంజింపజేసియుమంజులముగ
చిత్రసీమనునేలిచిరకీర్తినొందియు
రసరమ్యపాటలురాశిపోసి
(తే.గీ.)
తెలుగుభాషకుచొక్కపుజిలుగులద్ది
శబ్దసౌందర్యగరిమకుసానబెట్టి
మెరుగుపరిచితివీవయ్యమేటిగాను
అందుకో"సినారె"సతమువందనములు
"సాహితీరథసారథీ !సౌమ్యశీలి"!!!

కామెంట్‌లు