*వీరబ్రహ్మేంద్రస్వామి*;-మమత ఐల--కరీంనగర్--9247593432

 క.
పరుగులతోడచ్చమ్మయె
శరవేగము తోడవచ్చి చాటున జూసెన్
నిరతము బ్రహ్మయ్య పనుల
గరిమకునాశ్చర్యపోయి కదలక నిలిచెన్
క.
మరునాడీ గోప్యమ్ముకు
పరివారము వందనమిడ పాండిత్యంబున్
గురువై బోధించె హితము
జరుగెడి స్థితి గతులన్ని జగతికి మనసా!
కామెంట్‌లు