పద్యాలు ; -మమత ఐల-కరీంనగర్9247593432
 దత్తపది:- దంతెలు.. దూలాలు.. స్తంభాలు ..కిటికీలు
క.
ఎదుగుము  *దంతెల* నెక్కచు
మృదువగు *దూలాల* వంటి మిత లోచనతో
కదలని *స్తంభా‌‌ల* గృహపు
యెదయను *కిటికీలు* తెరువ హిమమౌ జన్మమ్ 
 
అంశం:-నది
క.
నలువంపుల బారుచు నది 
సులువుగ సంద్రమున జేరు శుభయోగముగా
జలముకు పల్లము దెలియును
నిలలో పరుగెత్తి సాగు నిలబడదెచటన్

కామెంట్‌లు