పద్యాలు ; మమత ఐలకరీంనగర్9247593432
 న్యస్తాక్షరి:- భా..గ..వ..తం
తే.గీ
*భా* రతీయుల జన్మంబు భాగ్యమవగ
*గ* రిమ గల గొప్ప వారెల్ల సురులవోలె
*వ* రుసగా పుట్టిరీపృథ్వి భాగమందు
*తం* డ్రి పరమాత్మ బ్రోవంగ తక్కువేమి

న్యస్తాక్షరి:- భా..గ..వ..తం (పాదాదిలో)
తే.గీ
భాగవతమున కృష్ణుని బాల్య క్రీడ
గనుచు జనులెల్ల మురిసిరి ఘనత గాంచి
వర్షముకు గొడుగువలెఁ గోవర్ధనగిరి
తండ్రిగా యెత్తి గాపాడె తండునంత

కామెంట్‌లు