హాస్యగాడికి కిరీటం;; (నిజంగా జరిగిన కథ);-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   1416 లో సుకేత్ పంజాబ్ లో ఒక చిన్న రాజ్యం. అప్పటిలోసుకేత్ రాజు పరిపాలనా దక్షత లేని వాడని తొలగించి కొత్త రాజును ఎన్నుకునేందుకు ఆ రాజ్యపు ప్రజలు చరిత్రలో కనీ విని ఎరుగని  కొత్తరకం చాటింపు వేయించారు.
      భారతదేశంలో గల ప్రఖ్యాత నాటక కళాకారుల్ని తమ రాజ్యంలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా దేశంలోని అన్ని రాజ్యాలకు సందేశాలు పంపారు. ఆ ప్రదర్శన సుకేత్ అంతఃపురంలోని తోటలో ఏర్పాటు చేయబడింది.ఏ నటుడైతే ప్రేక్షకులను పూర్తిగా మెప్పిస్తాడో అతనే ఆదేశానికి రాజన్నమాట! 
       ఆ విధంగా ఆ ప్రదర్శనలో మైన్ మదన్ అనే హాస్య సంచార కళాకారుడు అటు ప్రేక్షకులచేత, పోటీలో పాల్గొన్న తోటి కళాకారుల చేత కొనియాడబడ్డాడు! 
      ప్రజలు అతనిని రాజుగా నిర్ణయించి, నేరుగా స్టేజీ మీదకు తీసుక వెళ్ళి రాజుగా ప్రకటించి తీసుకవెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు! 
      ఆ విధంగా మైన్ మదన్ పేరును మదన్ సైన్ గా మార్చుకుని నిరాటంకంగా 26ఏళ్ళు సమర్థవంతంగా పరిపాలించాడు.
      అతని వంశంవారు ఆ రాజ్యాన్ని సంపూర్ణ స్వాతంత్ర్యం సంపాదించే వరకు అంటే 1947 వరకు పరిపాలించారు.
     (ఆధారం Believe it or not 6th edition)
                    """"""""""""""""""""""

కామెంట్‌లు