డైప్రొటొడాన్;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  కొన్ని మిలియను సంవత్సరాలనుండి అనేక రకాల జంతువులు అనేక రకాల కారణాలవలన నశించి పోయాయి,నశించి పోతున్నాయి!
       డైనోసర్లు( రాక్షస బల్లులు),ఆర్కియాప్ట్రిక్స్ పక్షులు, కొన్ని రకాల తాబేళ్ళు నశించి పోయాయి.
వాటిలో కొన్నింటిని శిలాజాల రూపంలో మాత్రమే చూస్తున్నాము.
      పదివేల సంవత్సరాల క్రితం దక్షిణ ఆస్ట్రేలియాలో కాల్లబొన్నా సరస్సు వద్ద సంచరించిన'డైప్రొటొడాన్'  (శాస్త్రీయ నామం-డైప్రొటొడాన్ ఒప్టాటమ్) క్షీరదాలు,శాఖాహారులు నశించి పోయాయి! డైప్రొటొడాన్ అంటే ముందర రెండు పెద్ద పళ్ళు గల జంతువులని అర్థం. 1893 నుండి 1953 వరకు ఆ ఎండిపోయిన సరస్సు వద్ద  శాస్రజ్ఞలు జరిపిన త్రవ్వకాల్లో సుమారు వెయ్యి డైప్రొటొడాన్ అస్థిపంజరాలు బయట పడ్డాయి! రెండు టన్నుల బరువుతో ఇవి హిప్పోపొటమస్( నీటి ఏనుగు) అంత బరువు ఉండేవి! అపారమైన తిండి,శత్రువులు లేక పోవడం వలన ఇవి బద్ధక జీవితం గడిపినట్లు శాస్త్రజ్ఞలు భావిస్తున్నారు, కొంతకాలానికి సరస్సు ఎండి పోయి,సరస్సు ప్రాంతంలోని గడ్డి, చెట్లు ఎండి పోయాయి.కాల క్రమేణా ఒక విధమైన పెద్ద బల్లులు,పెద్ద తోడేళ్ళు వీటికి శత్రువులుగా పరిణమించాయి!వీటికి తోడు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వాటి చావుకు కారణమయ్యాయి. అందుకే అవి నీటిని ఆహారాన్ని వెతుకుతూ ఎండిపోతున్న సరస్సు బురదలో కూరుకుని చనిపోయి ఉంటాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. వీటి అస్థి పంజరాలు పరిశీలిస్తే ఇవి దెబ్బలవలన గాయాలవలన చనిపోలేదని తెలుస్తోంది. ఈ అస్థిపంజరాలను సిడ్నీలో గల 'ఆస్ట్రేలియన్ మ్యూజియం) లో బద్ర పరిచారు.
      విరగని అస్థి పంజరాలను బట్టి ఇవి కరువు కాటకాలవలన ఆకలి,నిస్సత్తువుతో నశించి పోయినట్టు తెలుస్తోంది !
                 *****    ******
తెలుసుకోండి:అమెరికాలోని మెసాచుసెట్సు జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు రోనాల్ట్ మాల్ట్ 1962 లో  తెగిపడిపోయిన చేతిని అతికించిన మొదటి వైద్యడు.
            *******        ******

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం