పరహితమ్ - పరమార్థం;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
బాల పంచపదులు
==============
1.మబ్బులు నీళ్లు వర్షిస్తాయి!
   నదులు దాహం తీరుస్తాయి!
   గోవులు క్షీరం స్రవిస్తాయి!
   తరువులు ఫలాల్నిస్తాయి!
  పరహితం, పరమార్థం,రామా!

2.ఉడుతసాయం,
                      ఉదాహరణం!
   చెరగక నిలిచె,
                      రామసంతకం!
   తరతరాలకు,
                      అదే ఆదర్శం!
  ఉపకారంతో,
                 బతుకు ఉత్తమం!
పరహితం, పరమార్థం, రామా!

3.సేవచేస్తే మనిషి సమదర్శి!
   చేయిస్తే అతడు మార్గదర్శి!
   ఉపకారికి ఉపకారం మనిషి!
  అపకారికి ఉపకారం మహర్షి!
పరహితం, పరమార్థం, రామా!
_________


కామెంట్‌లు