జీవన లక్ష్యం;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.-9441058797.
బాల పంచపదులు
=================
 1.సాదాజీవనం ఆదర్శం!
   సత్యభాషణం ఆదర్శం!
   స్వధర్మాచరణ ఆదర్శం!
  ఆత్మసమర్పణ ఆదర్శం!
 ఆదర్శ సాధన ,
               ఆదర్శం, రామా!

2.ఆదర్శం ఆజీవన సమరం!
   సామర్థ్యానికి అలంకారం!
   తెలిసే  నవజీవనసారం!
   మనిషి ఆదర్శమే అమరం!
 ఆదర్శ సాధన,
               ఆదర్శం,రామా!
.
3. కర్షకుల నిజవృత్తి ఆదర్శం!
   శ్రామికుల శ్రమశక్తి ఆదర్శం!
   సైనికుల  దేశభక్తి  ఆదర్శం!
   బాలల విద్యాసక్తి ఆదర్శం!
   ఆదర్శ సాధన,
               ఆదర్శం, రామా!
________


కామెంట్‌లు