నజరానా!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు. 9441058797.
జూలై,29,సి.నా.రె.జయంతి సందర్భముగా 
=============================  
   1.ఆయనకు నిత్యం జయంతి!
   ఈరోజు భలే  మంచి రోజు!
   కవిత్వం భుజం తట్టినరోజు!
   ఇంటిపేరు సింగిరెడ్డి!
   సదా రెడీ ఆ కవితా సివంగి!
   వ్రాసె ప్రతీ అక్షరం సంపెంగి!
   ఆయనే నారాయణ రెడ్డి!
   కవిత నారాయణియమండి!

2.అందమైన పంచెకట్టు!
   ఆకర్షణీయ నొక్కులజుట్టు!
   అమరిన కళ్ళజోడు సెట్!
   నడకతో అందరినీ ఆకట్టు!
    కలంపై, గళంపై,ఆ పట్టు!
   వినే శ్రోతలు సదా జట్లుకట్టు!

3.ఆ ప్రతిభ బహుముఖం!
 విద్యార్థిగానేసాహితీకుసుమం!
 పద్యకావ్యాలు,వచనకవితలు!
నృత్యరూపకాలు, బుర్రకథలు!
యాత్రాకథనాలు, గజళ్ళు!
ఇలా ఎన్నెన్నో పరిమళాలు!

4.కవితాంబరాన విశ్వంభర!
   జ్జానపీఠాన అదిష్టించింది!
   ఆయనసాహితీ శోధన,
    ప్రామాణికమైన పరిశోధన!
కవితలఅన్యభాషానువాదాలు!
 అనేక దేశాలు సందర్శనం!
 అంతర్జాతీయ కవిసమ్మళన,
         భారతీయ ప్రాతినిధ్యం!

5.సినీగేయరచయితగా!
నన్ను దోచుకుందువటే  
ఆరంభించి హృదయాలు దోచి!
 మూడువేల సాక్ష్యాలుంచారు!
చదువు రానివాడవని,దిగులు
   చెందకు అని ఓదార్చారు! 
గాలికి, కులమేది ,నేలకు,    
కులమేది అని నిలదీసారు! 
అనుబంధం, ఆత్మీయత
,అంతా ఓ బూటకమన్నారు!
ఒసే రాములమ్మా అని,
ఊరూరా జనాల్ని ఊపేసారు!
సి.నా.రె., భళారే,
సినీగీతాల, చిరునామా!
_________


కామెంట్‌లు