వినుకో ఓ మానవా! (మణి పూసల ప్రక్రియ గేయం) - గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.; సెల్ :9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మానవా ఓ మానవా
హింస చేయుట మానవా
పెద్దల మాటలు వినుకొని
సద్గతి దారిని కనవా.  !

జీవులన్నీ సమానమని
యధార్థాన్ని తెలుసుకొని
నడుచుకోవాలి మనం
అందరం ఇక సర్దుకొని  !

తోటి ప్రాణుల ప్రేమించు
కనికరంతో పోషించు
కోరుతాయి నీ చెలిమిని
ఆనందం పొంది చెలించు !

అసత్యమును ఆడవద్దు
సత్యము పలుకుటే ముద్దు
ఈ నిజమును తెలుసుకోని
గ్రహించు ఇక ఈ పొద్దు  !

ఎవరికి చేయకు ద్రోహం
వదులుకో ఇక నీ అహం
ఇక ఇది నీకే మంచిది
నిలుపుకో నీ నిగ్రహం !

ద్వేషాన్ని పెంచుకోకు
స్నేహాన్ని తెంచుకోకు
ఇవి నీ జీవన సత్యాలు
అని నీవిక మరువబోకు !

ఇక కులం తలం ఎంచకు
మరి ఎవరికి తలవంచకు
నీకు నీవే సాటి అని
తెరను నీవు ఇక దించకు !

అడ్డదారిలో నడవకు
బిడ్డ చేయినిక విడవకు
ఇల ఆదర్శంగా నిలువు
పడి లేచి తడవ తడవకు !

అశాంతి చింతను వదులు
శాంతి స్థాపనకు కదులు
సాధించు నీవు విజయం
ప్రశాంతి మదిలో మిగులు

ధన దాహం వదులుకో
గురు ద్రోహం మానుకో
మసులుకో ఇక మనిషిగా
శిష్యుడవై కోలుకో  !


కామెంట్‌లు