ప్రజా నాయకుడు ఎన్.టి.ఆర్;-ఏ. బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.

 లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు  దేశ సంక్షేమ నిధికి డబ్బులు సమకూర్చడం కోసం  రామారావు గారు తన బృందంతో బయలుదేరి నాటకాలాడి ధనాన్ని పోగుచేసి ప్రధానమంత్రి నిధికి పంపించారు. ఆ సందర్భంగా విజయవాడ వచ్చి వారి బృందంతో నాటకాన్ని కూడా ప్రదర్శించారు. అంతకు ముందే నాకు పరిచయమున్న వారిని ఆహ్వానించి బందా గారిని  పరిచయం చేస్తే బందా గారూ మీ గురించి విన్నాను కృష్ణ పాత్ర అద్భుతంగా చేస్తారని ఆ పాత్ర చేసిన తర్వాత గుత్తి వంకాయ కూర అద్భుతంగా పాడతారని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి అని పాదాభివందనం చేశారు అది ఆయన సంస్కారం. ఆ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలో ఓలేటి, యజ్ఞ నారాయణ శాస్త్రి, కె వెంకటేశ్వరరావు, శ్రీనివాసన్, ఎన్టీ రామారావు,  సూర్యనారాయణ మూర్తి, ప్రసాద్, కనకయ్య, శ్రీనివాస మూర్తి, లింగరాజు శర్మ, గౌస్ మొహిద్దీన్, ఏ బి ఆనంద్, బందా కనకలింగేశ్వరరావు, రామవరపు సుబ్బారావు తదితరులు.
కామెంట్‌లు