ఉత్తమ విద్యార్థి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 విద్యార్థి అంటేనే విద్యను అర్ధించే వాడు అని అర్థం. నాకేమీ తెలియదు నాకు చెప్పండి అని అడిగితే వాడిని ఉపాధ్యాయుడు దగ్గరకు తీసుకుంటాడు. అది విద్యార్థి  మంచి  లక్షణం కనుక తన తోటి  విద్యార్థులలో ఎవరు బాగా చదువుతున్నారు  ఎవరికి బాగా మార్కులు వస్తున్నాయో వారిని దృష్టిలో పెట్టుకొని వారి కన్నా ఎక్కువగా చదవాలన్న తపన కలిగిన వాడు ఉత్తమ విద్యార్థి అవుతాడు. చదవడం అంటే  పాఠం వల్లి వేయడం కాదు,  పాఠం కానీ పద్యం కానీ కంఠస్తం చేస్తే అది తెలుస్తుంది  దానినే అప్పుడు చెబుతాడు  కానీ దానిని ఎరగడం ముఖ్య లక్షణం. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని  శ్రద్ధగా విని, విషయం తెలిసి దానిని ధారణ చేసి, దానిని సాధన చేయడం వల్ల మాత్రమే  మంచి చదువరి అనిపించుకుంటాడు. ఆ ఎరుక లేకుండా చదివితే ఆ ఫలితం ఉండదు. చదువుతున్నంత సేపు తనకది తెలిసినట్లే ఉంటుంది  తరువాత దాని గురించి తెలియదు.
పోతనగారు ప్రహ్లాదునితో చెప్పించినట్లు  చదువులలోని మర్మమెల్ల తెలిసితి తండ్రి అని.  ఆ మర్మాన్ని తెలుసుకోకుండా పై పైన చదివితే దానికి ప్రయోజనం ఉండదు. చదివినంత సేపు సద్గుణి అనిపించుకుంటాడు. దానిని పోలుస్తూ వేమన చెరువులో కప్ప తామరాకు మీద కూర్చుంటుంది  అక్కడ ఎంత సేపు ఉంటుంది  క్షణకాలం  తర్వాత మామూలే  అలా కాకుండా చదివిన ప్రతి అక్షరాన్ని గుర్తుపెట్టుకొని క్షరం కాకుండా చూసుకునేవాడు  ఉత్తమ విద్యార్థిగా ఉత్తమ పౌరునిగా ఎదుగుతాడు అని వేమన చెబుతున్నాడు. కామెంట్‌లు