మూఢనమ్మకాలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 సమాజంలో పాతుకుపోయిన  మూఢనమ్మకాలను దృష్టిలో పెట్టుకొని  తగిన పోలికలతో  చక్కటి ఉదాహరణలను  పామరులకు కూడ అర్థమయ్యే ట్లుగా రచించినవాడు వేమన.  జీవితంలో ఒకసారైనా గంగాస్నానం చేసి తీరాలి  అన్న నమ్మకాన్ని ప్రజల్లో  ప్రచారం చేసిన కొంతమంది కోసం అనేక మంది  బాధపడుతున్నారన్న అభిప్రాయంతో తాను ఈ కార్యాన్ని ప్రారంభించాడు.  అప్పట్లో వేమనను వ్యతిరేకించిన వారు ఉన్నారు, సమర్థించిన వారు ఉన్నారు అన్ని మనస్తత్వాలు ఒక మాదిరిగా ఉండవు కదా ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు కూడా లేవు. ఎంత కష్టపడి  వెళ్ళాలో వెళ్లిన వారికి అర్థమవుతుంది. కొంకణి దేశం  (కేరళ) వెళ్ళిన కుక్క సింహం కాదు కాశీకి వెళ్ళిన పంది  ఏనుగు కాదు అన్న ఉదాహరణలతో మీరు కాశీకి వెళ్లి గంగలో ఎన్ని మునకలు వేసినా కేరళ వెళ్లి ఎంత ప్రకృతిని ఆస్వాదించినా ఎలాంటి మార్పు రాదు అని చెప్పి అన్ని జాతులలో పుట్టిన వారు బ్రాహ్మణులు కారు,  బ్రహ్మజ్ఞానము తెలిసిన వారు మాత్రమే బ్రాహ్మణులు తల్లి గర్భం నుంచి వచ్చిన శూద్రుడు మావితో పుట్టినవాడు  అక్షరాలను నేర్చుకొని  ద్విజుడు, వేదములను నేర్చి విప్రుడు, దానిని జీవితంలో అనుసంధానం చేసి బ్రాహ్మణుడు అవుతాడని  పెద్దలు చెపుతారు. ఆ ఉదాహరణ ఇస్తూ ఎద్దేవా చేస్తూ మనలను జాగృతి పరచటానికి వ్రాసారు.  


కామెంట్‌లు