పూలమ్మిన చోట కట్టెలమ్మడం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.


 అప్పు ఇచ్చిన వాడి వెంట  చెప్పులు ఉన్న వాడి వెంట వెళ్ళ రాదు అని సామెత.  చెప్పులు వేసుకున్న వాడు ముళ్ళలో, రాళ్ళలో కూడా వెళితే...అప్పు ఇచ్చిన వాడి  వెంట వెళితే బంటు లాగానే ఉండాలి. జీవితంలో ఏ జీవి సాత్విక జీవితాన్ని గడపడం  మనం చూడం. చిన్న అధికారి నుంచి కోటీశ్వరుని వరకు ఈ కష్టాలు తప్పవు ఎవ్వరికీ. పాండవులు, హరిశ్చంద్రుడు నుంచి అనేకమంది రాజ్యాలను పరిపాలించిన వారు ఇలా  అనేక కష్టాలను ఎదుర్కున్న వారే. నలుడు తన అవతారాన్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ధనవంతుణ్ణి అన్ని సుఖాలను అనుభవిస్తున్నాను అని  ఎవరూ గుండె మీద చేయి వేసుకుని చెప్పలేరు. తన తెలివి వల్ల ధనాన్ని సంపాదించవచ్చు కానీ ప్రకృతి కలిగించే ఇక్కట్ల నుంచి అతను తప్పించుకోలేడు. పాండవులు జీవితాన్ని ఎంతసుఖంగా గడిపారు రక్త సంబంధీకుల కుసంస్కారం వల్ల అడవుల పాలు కావలసి వచ్చింది, అష్టకష్టాలు పడి  భీముడు అందరినీ రక్షించ గలిగాడు. అజ్ఞాతవాసానికి వచ్చేసరికి  వారి వేష భాషలను మార్చుకొని ఎవరికి వచ్చినది వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా విరటుని రాజు కొలువులో ప్రపంచాన్ని జయించగల సామర్ధ్యం కల అర్జునుడు  విరాటరాజు కుమార్తెకు నాట్యాన్ని నేర్పే నాట్యాచారుడిగా ఉండవలసి వచ్చింది  సమస్త భోగాలు అనుభవించిన ద్రౌపది విరట రాజు భార్యకు పూల మాలలు  తయారుచేసే చెలికత్తె (సైరంధ్రి) గా మారి విరటుని భార్య సుధేష్ణ చెప్పినట్లు  చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అది ప్రకృతి ప్రకోపించి నప్పుడు జరిగే విష పరిణామం దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. 


కామెంట్‌లు