రహస్యం రహస్యంగానే ఉండాలి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రహస్యం రహస్యంగా ఉండాలనుకుంటే  అభిమానులతోనే చెప్పుకోవాలి లేదా తనకు నమ్మకమైన కుటుంబ సభ్యులతో కానీ,  ఆత్మీయులతో గానీ పంచుకోవాలి మరొకరికి చెపితే అది అందరికీ తెలిసిపోతుంది. అవకాశం వచ్చినప్పుడు ధర్మరాజు దగ్గర తల్లి కుంతీదేవి రహస్యాన్ని దాచింది. దానితో ధర్మరాజు తల్లిని శపించాడు.  అప్పటి నుంచి ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదన్న నానుడి ప్రచారంలో ఉంది అంటే వారు చెప్పదలచుకున్న ఏ రహస్యం 
అయినా అనుకోకుండా అది అందరికీ మాటల సందర్భంలో చెప్పేస్తారు. రహస్యం చెప్పినట్లుగా కూడా ఆమె గమనించదు చెప్పేంతవరకు  కూడా. కొంతమంది చెవులు కొరుక్కునే వాళ్ళు ఉంటారు  వారికి కొంచెం రహస్యం తెలిసినా అది ఊరంతా చాటింపు వేసినట్టుగా చెప్పేస్తారు లేకపోతే వాడికి కడుపులో మంట తగ్గదు. అందుకే వేమన యోగి తన చుట్టూ చేరే ప్రేక్షకులలో ఎవరు మంచి వారో, ఎవరు చెడ్డవారో తెలుసుకోవాలని అన్నాడు. సహజంగా చెప్పేవాడి బుద్ధి కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఒకరహస్యం చెబితే  దానికి మరికొన్ని కలిపి వ్యక్తిగత విషయాలను కూడా వారి చెవిన పడడంతో వారి నుంచి చెడ్డ ఫలితాలు వస్తాయి. మాటకు మాట అనుకోవడమే కాక, ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే వరకు ఆ పరిస్థితి వస్తుంది. అందుకే ముందే జాగ్రత్త పడమని చెప్తారు. పెదవి దాటితే పృథ్వి దాటుతుందని సామెత. అది ఎంత వరకు వెళుతుందో తెలియదు దానిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి అని మనకు నీతి చెప్తున్నాడు వేమన.


కామెంట్‌లు