సహజ నటుడు సిహెచ్ నారాయణ రావు;-ఏ.బి ఆనంద్,ఆకాశవణి,విజయవాడ కేంద్రం,9492811322
 సినీ రంగంలో కథానాయకునిగా ప్రవేశించి జీవితాంతం చిన్నచిన్న వేషాలతోనైనా సరే  తన జీవితాన్ని సినీరంగానికి అంకితం చేసిన మహానటుడు  చిత్తూరు వి.నాగయ్య గారు. ఆయన నటించని పాత్ర లేదు  ప్రతి పాత్రలోనూ జీవిస్తూ అనేక లక్షల మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన  అద్భుత నట శిఖామణి. వారి తరువాత వచ్చిన సిహెచ్ నారాయణ రావు గారు  కథానాయకునిగా ప్రవేశించి  అనేక సినిమాలలో నాగయ్యగారితో నీవానేనా అనట్లుగా నటించి తెలుగు, కన్నడ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు. రేడియోలో నాతోనూ, శ్రీ గోపాల్ తోనూ చక్కటి పరిచయం ఉంది. వారు విజయవాడ వచ్చినప్పుడు మా దగ్గరికి రావడం మేము మద్రాసు వెళ్లినప్పుడు వారి ఇంటికి వెళ్లడం  ఆనవాయితీగా మారింది  ఆనాటి కథానాయికలు  రుక్మిణి  కోయంబత్తూర్  సోదరీమణులతో (లలిత, పద్మిని, రాగిని) పాటు జెమినీ వారి జీవితం చిత్రంలో  వైజయంతి మాలతో కూడా నటించిన  మహానటుడు. వ్యక్తిగతంగా నాకు  కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం ఉంది. దానికి గుర్తుగా వారి అబ్బాయికి నా శ్రీమతి పేరు  అరుణ కనుక అది వారి అబ్బాయి కి అరుణ్ కుమార్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇంత సహజ నటుడు దొరకడమే మా అదృష్టం అని జెమిని వాసన్ గారు పత్రికా ముఖంగా వెల్లడించారు. చలం గారు రచించిన నవలలో గొప్ప నవల మార్తా మా శ్రీ గోపాల్  దానిని గంట నాటకంగా వ్రాయించి  దానిలో ప్రధాన పాత్రకు సిహెచ్ నారాయణ రావు గారిని కలిసి  ప్రధాన పాత్ర నిర్వహించాలని చెబితే ఆయన అంగీకరించి  విజయవాడ వచ్చి మూడు రోజులు  సాధన చేసి  40 మంది నటీనటులతో రికార్డ్ చేశాం. తెల్లవార్లూ రికార్డింగ్ జరిగినా నారాయణ రావు గారు ఎక్కడా విసుగు లేకుండా చేశారు  అలాంటి ఘటనలు చాలా అరుదు. నేను శ్రీ గోపాల్ రమణ మహర్షి జీవితాన్ని తెలుసుకొని  శ్రీ భగవాన్ రూపకాన్ని  రచించి జాతీయ  బహుమతులకు పంపించాలని నిర్ణయించుకొని  మద్రాస్ వెళ్లి నారాయణ రావు గారిని తీసుకొని తిరువన్నామలై లో అంతా తమిళం మాట్లాడుతూ  ఉంటారని వీరిని దుబాసీగా తీసుకెళ్లాం. తీరా అక్కడికి వెళితే అంతా తెలుగులోనే మాట్లాడుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో  నాకు కావాల్సిన విషయ సేకరణ చేసి  దైవ దర్శనం చేసుకుని కృష్ణ బిక్షు మిస్సెస్ తల్యార్ ఖాన్  ఎదురుగా ఉన్న చలం గారిని, సౌరిస్ గారిని కలిసి  అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఆ మూడు రోజుల్లో నారాయణ రావు గారి జీవితం లో జరిగిన అనేక సంఘటనలను సంభాషణ రూపంలో రికార్డు చేశాను. ఆ మహానటునితో నేను దిగిన ఛాయాచిత్రం.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం