లవకుశులు ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.విజయవాడ కేంద్రం.9492811322

 మా తేలప్రోలు గ్రామానికి  సంబంధించిన శంకర రెడ్డి మద్రాసు వెళ్లి సినిమా హాల్ కట్టి కొంచెం డబ్బులు కూడబెట్టిన తర్వాత లవకుశ  సినిమా తీయడానికి ప్రయత్నం చేసి ఎన్టీ రామారావు గారితో మాట్లాడితే  ఆయన అంగీకరించి  సీతగా ఆంజలీ దేవి పేరు  చెప్పారు  తరువాత లవుడు కుశుడు పిల్లల కోసం  ముందు ఆడపిల్లలను పెట్టి అనివార్య కారణాల వల్ల ఆ వయసు కలిగిన కుర్ర వాళ్ళని పిలిచి  ఆడిషన్ నిర్వహించి  సుబ్రహ్మణ్యం నాగరాజులను ఎంపిక చేశారు. ఆ చిత్రం ఎంత గొప్పగా ప్రదర్శించబడిందో అది అందరికీ తెలుసు. వీళ్లు పెద్దవాళ్ళు అయిన తర్వాత  నాగరాజు, సుబ్రమణ్యం  మాకు చాలా సన్నిహితులయ్యారు.  ఉప్పలపాడు సిద్ధాంతి గారు  తల్లపు రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అనేక పర్యాయాలు వారికి  ఆర్థిక సహాయం కూడా అందించారు. ఒక సన్మాన సభలో నేను, శ్రీనివాస రెడ్డి గారి భార్య శ్రీమతి లక్ష్మి  నాగరాజు సుబ్రమణ్యం పాల్గొన్న ఛాయాచిత్రం మీకోసం.కామెంట్‌లు