జంధ్యాల;-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 జంధ్యాల మాకు చాలా దగ్గర స్నేహితుడు. కాలేజీలో నాకు జూనియర్ నా నాటకాల్లో  నటించాడు. తను, సుత్తి వీరభద్ర రావు, విజయ రామ్ వీళ్లంతా కలిసి చదివేవారు.  ఫిలిప్స్ డీలర్ నారాయణ మూర్తి గారి అబ్బాయి  కళాశాల విద్య పూర్తయిన తర్వాత తను వ్యాపారం మొదలు పెట్టాడు. తండ్రిని మించిన మెళకువలతో  వ్యాపారాన్ని బాగా పెంచాడు. 
జంధ్యాల మద్రాసు వెళ్లి తన బృందంతో మొదట్లో  చక్కటి నాటకాన్ని ప్రదర్శించినప్పుడు  దానిని దర్శకులు విశ్వనాథ్ గారు చూశారు. అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించి తాను పిలిచి తన సినిమాలకు మాటలు రాయించుకున్నారు. ఆత్రేయ గారితో కలిసి నీవానేనా అనేటట్టుగా  చక్కటి సంభాషణలను  మనసుకు పట్టే విధంగా వ్రాశాడు. అది గమనించి విశ్వనాథ్ గారు  తన సినిమాలో మాటలు ఆచార్య ఆత్రేయ జంధ్యాల అని ప్రకటించాడు. తరువాత తనదైన శైలిలో నాలుగు స్తంభాలాట సినిమాను కొత్త నటీనటులతో చెయ్యడం చూసి అనేకమంది నిర్మాతలు  దర్శకత్వ బాధ్యతలు  అప్పగించారు. చివరకు  రామానాయుడు గారు కూడా  తమ సంస్థలో నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో ఒదిగి ఉండే జంధ్యాల అందరి మనసులను దోచుకున్న వాడు  పాతవారిని మర్చిపోకుండా  అందరికీ తన సినిమాలలో వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. అలాంటి వాడిని మేమంతా శాస్త్రి అని పిలుస్తాం. ఎంత పెరిగినా అంత ఒదిగి ఉండాలి అన్నది అతనిని చూస్తే తెలుస్తుంది. అతను నాటకాలు వ్రాసి నాటక పరిషత్తుకు  తీసుకు వచ్చినప్పుడు చాలా సార్లు నేను నండూరి సుబ్బారావు గారు  న్యాయనిర్ణేతలుగా వెళ్ళేవాళ్ళం. అతనికి బహుమతి రాకపోయినా మాట్లాడేవారు కాదు ఆ తెల్లవారి మా కేంద్రానికి వచ్చి  ఆనంద్ గారూ నా నాటకంలో  ఏమైనా తప్పులు ఉన్నాయా  ఉంటే చెప్పండి వాటిని సరి చేసి తరువాత ప్రదర్శనలో మార్చుకుంటాను అని సౌమ్యంగా అడిగేవారు. మేము చెప్పిన దానిని అంగీకరించి దానిని సరి చేసుకునే వాడు కూడా. ఒకరోజు ఆయనతోపాటు నిర్మాత కృష్ణంరాజు గారిని వారి సినిమాలో కొత్తగా జంధ్యాల పరిచయం చేస్తున్న కవితను తీసుకువచ్చి మాకు పాదాభివందనం చేసి ఆనంద్ గారు, సుబ్బారావు గారు, రామ్మోహన్ రావు గారు లేకపోతే నేను ఇంత స్థితికి వచ్చి ఉండేవాణ్ణి కాదు కవితా నువ్వు కూడా వారికి పాదాభివందనం చెయ్ నాలుగు అక్షరం ముక్కలు తెలుస్తాయి అని ప్రోత్సహించాడు. మీకు  వీలుంటే తప్పకుండా వేషాలు ఇస్తాను రమ్మని ఆహ్వానించాడు. సుబ్బారావు గారు, రామ్మోహన్ రావు గారు వెళ్లారు కానీ నేను వెళ్ళలేదు. మీరెందుకు రావడం లేదు అన్నాడు జంధ్యాల నాకు సినిమాలంటే అంత మక్కువ లేదు. నేను ఆకాశవాణినే  నమ్ముకున్నాను నా జీవితం ఆకాశవాణికే  అంకితం అని చెప్తే ఎంతో మురిసి పోయాడు. సినీరంగ ప్రవేశం జరిగిన సందర్భంగా ఉషశ్రీ గారు, శ్రీనివాసన్ గారు ఆకాశవాణికి పిలిచి సన్మానం చేశారు ఇది ఆ చిత్రం.

.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం