మారుతీ రావు కళ్యాణి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 గొల్లపూడి మారుతీ రావు గారి పేరు వినని వారూ ఎవరు ఉండరు. అనేక సినిమాలలో తన పాత్రను అందంగా తీర్చిదిద్దుకున్న వారు. మొదట ఆయన పత్రికలో పనిచేసి తరువాత హైదరాబాదులో ఆకాశవాణిలో చేరి అక్కడి నుంచి విజయవాడ వచ్చారు.  అప్పటికే ఆయన అనేక నాటకాలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఆయన వ్రాసిన ప్రతి నాటకాన్ని కే వెంకటేశ్వరరావు గారు వేదికపై ప్రదర్శించేవారు  కళ్యాణి లాంటి అద్భుతమైన నాటకాల సృష్టికర్త మారుతీరావు గారు. వారు రాసిన మకుటాయమానమైన రాగరాగిణి  మా నండూరి విఠల్  గారికి బాగా నచ్చింది  దానిలో ప్రధాన పాత్ర తాను నిర్వహించాలని మారుతీ రావు దగ్గర అనుమతి తీసుకుని ఈ నాటకాన్ని గంటకు కుదించి  ప్రసారం చేశాం. ఆయనతో పాటు నేను, రజనీ, నాగరత్నమ్మ, శ్రీరంగం గోపాలరత్నం, నండూరి  సుబ్బారావు, సి.రామ్ మోహన్ రావు, కుటుంబరావు మిగిలిన నటులు. ఈ నాటకం ప్రసారం అయిన తర్వాత కె.వెంకటేశ్వరరావు రేడియో స్టేషన్ కు వచ్చి  మా నాటక నిర్వాహణ  ఆయన రంగస్థలం మీద ప్రదర్శించే నాటకాలని మించినవని పొగడ్తలతో ముంచి వేశారు. చిన్న వేషమైనా నండూరి విఠల్ ని తినేశావ్ బ్రదర్ అని కౌగలించుకున్నారు. చైర్మన్ నాటకం చూశాను నిన్ను, డాక్టర్ కె వెంకట్ రాజు గారిని అభినందించకుండా ఉండలేను అని బందా గారి ఎదురుగా చెప్పడం నాకెంతో ఆనందాన్నిచ్చింది  నాటకాల్లో వేదికపై ఎందుకు నటించకూడదు అని అడిగారు. నేను రేడియోనే నమ్ముకున్నాను  మరి ఎక్కడా నటించను అని చెప్పాను నీ అంకితభావం నాకు నచ్చింది ఐ యాం సో హ్యాపీ  అని చెప్పి అభినందించి మరీ వెళ్లారు. గొల్లపూడి మారుతీరావు గారు తన రచనలు, ర.స.న నిర్వాహకులు కే వెంకటేశ్వరరావుకి రాసినన్ని నాటకాలు మరెవరికి రాయలేదు. అన్ని  రంగస్థల నాటకాలు వెంకటేశ్వరరావు గారివే. వారిలో ఉన్న  మంచి గుణం రచయితను దగ్గర కూర్చోబెట్టుకుని తనకు కావాల్సిన విధంగా వ్రాయించు కుంటారు  దానికి తగిన నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అన్ని పాత్రలు అందరికీ నచ్చేలా సాధన చేయిస్తారు  ఆ తర్వాత కానీ నాటకాన్ని ప్రదర్శనకు అంగీకరించరు. నాటకాలు బాగా ప్రాచుర్యం పొందడానికి కారకుడు  శివ శివ రామా రెడ్డి  సిహెచ్ కబీర్ దాస్, సండూరి వెంకటేశ్వర్లు,  జి ఎస్ ఆర్ మూర్తి  వెంకటేశ్వరరావు గారి జీవిత ఆశయం పల్లెల్లో నాటక కళ పెరగాలి వారు కూడా నటించాలి  ప్రతి గ్రామంలోనూ నాటక ప్రదర్శన చేయాలి  అన్నది. ఇక్కడ శిక్షణ శివ రామ రెడ్డి గారితో చెప్పి అనేక నాటకాలను పల్లె ప్రజలకు అర్థమయ్యేలా  వారి భాషలో రాయించి  ప్రదర్శించడం వల్ల  మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి రెడ్డి గారికి. ఆకాశవాణి లో ఎన్ని ప్రదర్శనలు చేసినా వాటిని మేము ప్రసారం చేసినంత  అందంగా రాలేదు అన్న అసంతృప్తి వెంకటేశ్వరరావు గారికి ఉంది. దానితో గురజాడ అప్పారావు గారు రచించిన  కన్యాశుల్కంలోని గిరీశం పాత్ర తీసుకొని వీరి పద్ధతిలో  మారుతీ రావు గారితో రాయించుకుని శంకరమంచి సత్యం ఆధ్వర్యంలో ఏకపాత్ర చేశారు. దానికి వచ్చిన మంచి పేరు మరొకదానికి రాలేదు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం