ఆచార్య చర్ల గణపతి శాస్త్రి;-ఏ. బి ఆనంద్,ఆకాశవాణి.విజయవాడ కేంద్రం.9492811322
 చర్ల గణపతి శాస్త్రి గారు ప్రజ్ఞా నిధి ఆయనకు తెలియని శాస్త్రం లేదు. కాళిదాసు రచనలన్నీ కంఠస్తం వారి రచనల్ని తెలుగులోకి అనువదించిన వాడు వాటి ముద్రణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రెస్సు పెట్టి  ఎంతో ఓపికగా పని చేస్తారని  స్త్రీలను ఏర్పాటుచేసి వారికి నేర్పి  ప్రచురించిన మితవాది. ఆకాశవాణిలో అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు.  ఆయన జీవితం చివరి రోజుల్లో కూడా  నియమ నిబంధనలకు లోబడి  చివరి క్షణం వరకు ప్రశాంతంగా జీవించారు. వారి కుమారుడు అకాల మరణం చెందితే  అది చూసి భరించలేక వారి శ్రీమతి గుండె ఆగిన క్షణాన గుండె నిబ్బరంతో  కంటి నీరు లేకుండా కన్న కుమార్తెలతో కలిసి ఇద్దరికీ కర్మకాండ ముగించిన  కారణజన్ముడు. ఓ రోజు ఊరికే  రేడియో కేంద్రానికి వచ్చినప్పుడు వారి జీవితానుభవాలను రికార్డు చేసి ప్రసారం చేశాను. వారు వచ్చిన ఆనందంలో 10 మంది పిల్లలను పోగుచేసి వారితో ప్రశ్నలడిగించి  దాదాపు గంట సేపు రికార్డు చేసి  నాలుగు విడతలుగా పిల్లల కార్యక్రమంలో ప్రసారం చేశాను. జీవితం మొత్తం తామరాకు మీద నీటి బిందువులా జీవించిన నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఈయన అనిపించింది  అలాంటి మేధావులతో సహచర్యం  ఆకాశవాణి నాకు పెట్టిన బిక్ష అందుకు ఎంతో గర్విస్తూ ఉంటాను, ఆనందిస్తుంటాను.


కామెంట్‌లు