మధుర గానం;-గుండాల నరేంద్రబాబు - తెలుగు పరిశోధకులు-తిరుపతి-సెల్: 9493235992.
పల్లవి:
కొమ్మల్లో కువ కువలాడే కోయిలా
కమ్మగా మదినే ఊపేవు ఊయలా... 
మావి చిగురు మంచిగ మేసిన కోయిలా
దివిలో విహరింప చేశావే మమ్మిలా...  

చరణం:1
పువ్వు పువ్వున పొంగేటి తేనె ఊటలా
నవ్వు నవ్వున విరిసేటి పూల తోటలా
మువ్వ మువ్వ
న మ్రోగేటి అందె పాటలా
 రివ్వు రివ్వున సాగేటి గువ్వ బాటలా

చరణం:2
మది ఎన్ని గాయాలున్నా మధుర గానమే
హృదిని ఎన్ని గుండాలున్నా దరహాసమే
నదికి ఎన్ని వంపులున్నా వయ్యారమే
జిందగీలో కుదుపులున్నా పోరాటమే


కామెంట్‌లు