చిలకమ్మ చెలిమి;-గుండాల నరేంద్ర బాబునెల్లూరుసెల్:9493235992
చిలక ముక్కు చిన్నది
చిరు నవ్వులు ఉన్నది
సొగసుగానే ఉన్నది
సరదా పడుతున్నది


పంచదార చిలకరో
పంచకు చేరిందిరో
పండును తెచ్చిందిరో
ప్రేమగ ఇచ్చిందిరో

పంచె వన్నెల గుమ్మరో
మచ్చలేని కొమ్మరో
మచ్చిక కోరిందిరో
పచ్చని చెలిమీయరో

దరికీ  చేరిందిరో
వరమే ఇమ్మందిరో
కరుణే కోరిందిరో
కరుణించ వేమిరోకామెంట్‌లు