సమస్యాపూరణలు;-జి.లింగేశ్వర శర్మ9603389441
వికృతపుచేష్టలతోడను
చకచకనీధర ప్రకృతిని స్వార్థముకొరకై
సకలము ధ్వంసము జేసెడు
నకులునిగనిగాంధివేదనంబడెనయ్యో

కంగారుగ వెడల గుడికి
బంగరు గనియని దలంచి బాగుగ త్రవ్వన్
బంగరు భూమిని నల్లని
బంగారముదొరికె నంచుభక్తుడు నేడ్చెన్


ఆంగ్లభాషయన్నయభిమానమును పెరుగ
తల్లిదండ్రులెల్ల తప్ప కుండ
విద్య నేర్ప నెంచ విలువలు తగ్గగా
తెలుగు భాష లోన వెలుగు లేదు


కామెంట్‌లు