బోనాలు;-జి.లింగేశ్వర శర్మ9603389441
 సీ
రోగబాధలుబాపిలోకాన ప్రజలకు
ఆరోగ్యమొసగెడియాదిశక్తి
ఆషాఢమాసానయామహంకాళికి
భగ్యనగరమందుభక్తులంత
బోనమునర్పించిపూజల్నిజేసియు
భక్తితోడనుతల్లిశక్తికొలది
పిల్లపాపలనంతచల్లంగజూడనీ
వేడుకొందురుకాళివేడుకగను
తే
బోనమెత్తినమహిళలపూనకాలు
పోతురాజులటలతోడపోవుచుండ
డప్పుమోతలనడుమునగొప్పగాను
సాగుచుండునూరేగింపుసంబురముగ

కామెంట్‌లు