సాటిలేని మేటి 'స్నేహము';--గద్వాల సోమన్న,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,కర్నూలు జిల్లా,సెల్:9866414580
విలువైనది స్నేహము
వెలుగునిచ్చు దీపము
ప్రేమకు ప్రతిరూపము
అందుందోయ్!  త్యాగము

అసమానం స్నేహము
అపురూపం స్నేహము
సృష్టిలో అమూల్యము
బ్రతుకున బహుమానము

ఆపదలో సాయము
హత్తుకొనును అనిశము
స్నేహమంటే వరము
వర్ణింప ఎవరి తరము?

స్నేహమే సిరి సంపద
లేదు దానికి సాటి
దీనితో పోల్చినా...
స్నేహమే కడు మేటి

చేయకోయి ద్రోహము
చేయమోయి న్యాయము
పవిత్రమైన స్నేహము
దేవుని వర ప్రసాదము

భగవంతుని ప్రతినిధి
లోకంలో స్నేహము
బ్రతుకులోన పెన్నిధి
నాకమిలను స్నేహము


కామెంట్‌లు