శ్రీ వేంకటేశ్వర స్తవము; ప్రభాకర్ రావు గుండవరం--ఫోన్ నం.9949267638
దేవ దేవ ఆది దేవ
కరుణాలవాల శ్రీనివాసా
సప్తగురులపైన వెలసి
సకల లోకముల ఏలేవు నీవు

నిన్ను శరణు వేడినాను
జగదీశ మమ్ము కరుణించుమా
లోకపాలక పరమ పావన
నీవే మాకు ఆధారమూ

శంఖ చక్ర గదాధారి
నారాయణ నీవే దిక్కు
పాండురంగ దయానిధీ
మమ్మేలుము మా తండ్రీ

శ్రీనివాస వేంకటేశా
భక్తవత్సల ఆర్తరక్షక
దయతో మా మొరాలకించి
కాపాడుము వేదవేద్యా

ఏడుకొండలెక్కలేము
వేయి నామాలు చదువలేము
వేగమే దిగివచ్చి నీవు
మా బాధలు మాన్పవయ్యా

ఆపద్భాంధవ ఆదిశేష
నారాయణ పరమాత్మా
వాసుదేవ వామనా
శ్రీవారాహ మమ్మేలుమయ్యా
🌹🌹🌹

కామెంట్‌లు