అందమైన మన భూమి; ప్రభాకర్ రావు గుండవరం;-ఫోన్ నం.9949267638
పుట్టినాము పురిటి గడ్డ భరతభూమిపై 
నిలబెట్టినాము తెలుగు కీర్తి అవని గడ్డపై
అందరినీ కూడగట్టి ఐక్యతను చాటి చెప్పి
మంచి మాటతో మనుషుల మనసులనే గెలిచినాము
// పుట్టినాము  పురిటిగడ్డ //

సమతే జీవనమని మమతే ప్రాణమనీ
ప్రతీ మనిషిలో వికసించే జ్ఞానమే దైవమనీ
మంచిని నేర్పించి సహనముతో ఒప్పించి
సత్యమే జయమంటూ లోకానికి చాటినాము
// పుట్టునాము పురిటి గడ్డ //

నీవు నేననే భేదము ఎందుకు మనలోన
అందరమొకటైతే  అందుకొనది ఏమున్నది
కలిసి పని చేద్దాము అనుకున్నది సాధిద్దాము
అందమైన మన భూమిని ఆనందమయం చేద్దాం

// పుట్టినాము పురిటి గడ్డ //

కామెంట్‌లు