శాశ్వత జగత్ రక్షణ పథకం; -ప్రభాకర్ రావు గుండవరం;-ఫోన్ నం 9949267638
ప్రతీ యేటా తుపాన్ భీభత్సాలతో
ప్రకృతి వైపరీత్యాలతో
కుండపోత వర్షాలతో
జనావాసమంతా జలమయమవుతుంది

తీరప్రాంత మంతా
జలప్రళయానికి తల్లడిల్లి పోతుంది
జనమంతా చేప పిల్లల్లా
వరదల్లో చిక్కి గిల గిలా కొట్టుకుంటూ 
ప్రాణాలు విడుస్తున్నారు

తీరప్రాంతాలే కాదు ఇప్పుడూ
గల్లీ గల్లీ నీటితో నిండిపోయి
మ్యాన్హోల్లాన్నీ మృత్యు కుహరాలుగా మారి
పసి పిల్లలు మొదలు పండుటాకుల
 వరకు మృత్యువాత పడుతున్నారు

జీవమంతా నిస్తేజమవుతుంది
ప్రకృతి సంపద నశించి పోతుంది
మానవులకు మనుగడ భయంకరంగా మారుతుంది

అధికారయంత్రాంగం ఎప్పటికప్పుడే
ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తూ 
పునరుద్దరణ పనులు చేస్తున్నారు 
మళ్ళీ పునరావృతమవుతుంది

ప్రభుత్వాలు  ప్రతిపక్షాలు
సమిష్టిగా కలిసి "శాశ్వత జగత్ రక్షణా పథకం" కిందా 
మేధావులు శాస్త్రవేత్తలు ఇంజనీర్లతో ఘోష్టి జరిపి  
సరియైన ప్రాజెక్ట్ల నిర్మాణం చేబట్టి 
ప్రజలను ప్రపంచాన్ని జలప్రళయం నుండి కాపాడాలి

కామెంట్‌లు