చిన్ని ఆశ; - ప్రభాకర్ రావు గుండవరం-ఫోన్ నం 9949267638
ఒక చిన్న ఆశ
మనసులో నుండి తొంగి చూస్తుంది
లేలేత ఆకు కొన పైన నిలిచిన మంచు బిందువులా...................

ఆ ఆశ  మనో అంతరాలలో నుండి 
జారి గుండెలో గూటీలో నిలిచిపోయింది

ఆ లేత ఆకు కొన పైన నిలిచిన మంచు బిందువు 
మరో ఆకు దోనె లో పడి మరో నీటి బిందువుతో కలిసి నిశ్చలంగా నిలిచింది.

గాలి ఎక్కువైతే ఆ బిందువులు నీరై నేలపై జాలువారూతుంది
మనసు నుండి గుండెకు చేరి గుండెలో గూడు కట్టుకున్న ఆశ కన్నుల్లో నిలిచింది

పెదవి విప్పితే కన్నుల్లో నిండిన ఆశ జాలువారి
 ఆనంద భాష్పాలైతాయో.....
కన్నీరుగా మారుతుందో.....!!?

కామెంట్‌లు