విరుల విలాపం; -ప్రభాకర్ రావు గుండవరం-ఫోన్ నం.9949267638
పూలతోటకెళ్లాను
పూలు తెంప బోయాను
చేయి తాకగానె పూలు
ప్రాణ భీతి చెందేను

వలదు వలదు ఓ మనిషి
మము తాక కూడదో మనిషి
అందమైన పూలము మేము
అందాల పూలము మేము

అందరికీ పరిమళాలను
అందించే విరులం మేము
సున్నితంగ ఉంటాము
చూడ చక్కగుంటాము

దేవుని పద సన్నిధిలో
కొలువుదీరి ఉంటాము
అందమైన అతివల సిగను 
శృంగారం చేస్తాము

కామెంట్‌లు