పక్షుల గేయం;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు,సెల్:9966414580
చెట్టుపై చిలుకమ్మ
చెలిమినే పంచింది
తీయని పలకులతో
కడుపునే నింపింది

తోటలో నెమలమ్మ
పురివిప్పి ఆడింది
అద్భుత నాట్యంతో
కనువిందు చేసింది

గూటిలో  కోడమ్మ
గ్రుడ్లపై పొదిగింది
చక్కని పిల్లలను
ముద్దుగా లేపింది

కొమ్మల మధ్యలో
కోకిలమ్మ కూర్చుంది
గొంతు వీణ సవరించి
కమ్మగా పాడింది


కామెంట్‌లు