''టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్న మునినాయక్"


 హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎల్వి ప్రసాద్ డిజిటల్ ఫిల్మ్ ల్యాబులో ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ రంజిత్ ఆధ్వర్యంలో టాలీవుడ్ ఫిలిం ఫేర్ ఫెస్టివల్స్  అవార్డులు ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మెన్ శ్రీ పి.రామకృష్ణ గౌడ్,ప్రముఖ నిర్మాత శ్రీ ఎం.ఎన్.చౌదరి, ప్రముఖ నిర్మాత & దర్శకుడు శ్రీ అలీఖాన్ , ప్రముఖ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ శ్రీ ఆర్.మానీక్,ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీ నిక్సన్ మాస్టర్,ప్రముఖ నటుడు శ్రీ షెకింగ్ శేషు పలువురు సినీ ప్రముఖులు హాజరు అయి జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు టాలీవుడ్ తెలుగు ఫిలిం ఫేర్ అవార్డులు అందజేశారు. ఓ వైపు చదువుకుంటూ మరో వైపు సమాజానికి ఉపయోగపడే కవితలు రాస్తూ మొటివేషన్ స్పీకర్ గ ఎన్నో క్కార్యక్రమాలు చేపడుతూ వేలాది స్త్రీ, పురుషులను చదవాలన్న ఆసక్తి ఉన్న సరైన సదుపాయం లేని వారిని గుర్తించ్చి "మై ఫ్రెండ్స్ పోలీస్ అడ్డా" అనే వాట్స్ అప్ సమూహము ద్వారా దాదాపుగా 2500 స్టూడెంట్స్ కి ఆన్లైన్ ద్వారా ఉద్యోగం కోసం కావాల్సిన అన్ని అంశాలను పిడిఎఫ్ రూపంలో అందిస్తూ కేజీ టు పీజీ విద్యార్థులకు కావాల్సిన సమాచారం అందిస్తూ అభాగ్యులకు నేరుగా వెళ్లి సహాయం చేసి వారికీ అండగా నిలవడం అనాధ పిల్లలకు సహాయం చేయడం టాలెంట్ ఉన్న కొత్తవారిని పరిచయం చేస్తూ ఇండస్ట్రీకి కొత్త వ్యక్తులను పంపిస్తూ వారి జీవితాలకు వెలుగు ఇస్తూ ఇతరుల సంతోషాలను కోరుకుంటూ తన సేవతో ముందుకు దూసుకుపోతూ నేటి యువతకు ప్రముఖులకు సైతం ఆదర్శమైతున్న మునినాయక్ ని ''టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు మునినాయక్ కు" ఇచ్చామని సంస్థ అధ్యక్షులు రంజిత్ తెలియజేసారు. 
తెలుగు టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందజేసి ఘనంగా ప్రముఖుల చేతుల మీదుగా సన్మానించారు. వయసు చిన్నదే ప్రతిభ అద్బుతం అని ఎలాంటి స్వార్దం లేకుండా ఇప్పటి వరకు 2220 పై అవార్డులు అందుకున్న యువకుడు తెలంగాణ &  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ పాటశాలలో ఉచిత వ్యక్తిత్వ వికాస సదస్సులు నిర్వహించడమే కాకుండా  ప్రతి నెల ఒక ఆదివారం ఒక పూట ఫుట్ పాత్ పై ఆకలితో అలమటించే అభాగ్యులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అని అందుకే ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ టాలీవుడ్ ఫిలిమ్ ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు కి ఎంపిక చేసి అవార్డు అందజేశామని ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ నిర్మాత & దర్శకుడు,నటుడు శ్రీ డాక్టర్ రంజిత్ న్యూస్ టుడే కి తెలిపారు.యువ కవి,రచయిత,వ్యక్తిత్వ వికాస శిక్షకుడు,సమాజ సేవకుడు మునినాయక్ మాట్లాడుతూ ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ టాలీవుడ్ ఫిలిం ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తనను ఆదరించి అభిమానించి ప్రోత్సహించే ఆత్మీయులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మునినాయక్ కు ఆర్కే సాంస్కృతిక ఫౌండేషన్ టాలీవుడ్ ఫిలిమ్ ఫేర్ స్పెషల్ జ్యూరీ అవార్డు రావడం పట్ల అభిమానులు,ఆత్మీయులు, స్నేహితులు,గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి పలువురు మునినాయక్ ని అభినందిచారు.ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి పలువురు సినీ ప్రముఖులు తో పాటు అవార్డు గ్రహీతలు హాజరు అయ్యారు..
కామెంట్‌లు