బాలుడి ముద్దుమొహం
కనపడగానే
పొద్దు పొడిచింది
విరిసినపువ్వుల
సిరినవ్వులతో జగతి మురిసింది
నింగిని మబ్బుల
రంగులతో కోలాహలం
పుత్తడిగా భువి మెరిసింది
చిత్తడిగా వెలుగులో తడిసింది.
నింగి ముంగిట విరిసిన
వెలుగుపువ్వు రేకులొకటొకటే
విచ్చుకుంది
కలకానిది వెల లేనిది
వేకువ వెలిగిపోయింది.
ఇలకు జారిన వెలుగు రేఖల
సొగసులు
కొదవ లేకుండా కంటికి
విందులు చేసాయి.
వాడుకైన వేడుక ఇది
మది దోచే ఉషోదయమిది.
మదిని పూచే మధురభావనల
సుమ మాలలతో
మనస్ఫూర్తిగా స్వాగతిద్దాం
మధురమైన ఉషస్సును
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి