*గుర్తింపు (లఘు కవితలు )-ఎం. వి. ఉమాదేవి

 సృష్టిలో ప్రతి ప్రాణి గుర్తింపు కోరుతూ 
తనదైన పద్ధతిలోనే అస్థిత్వం చూపుతుంది 
ఇక్కడ ఎవరూ ఏదీ ఎక్కువ తక్కువలేదు 
అసహ్యమైన గొంగళిపురుగు లార్వానుండి 
ప్యూపా దశలో నిద్రించి అందమైన సీతాకోకై 
తోటలో మనోహర పుష్పాలను ఆస్వాదించి... 
పరపరాగ సంపర్కంతో అనేక వనాలకి 
అంకురార్పణ చేస్తున్న అల్పప్రాణి !
మనగుర్తింపు ఒకరిచ్చేది కాదు 
జన్మతః మనకృషికి సంబంధమైంది 
అందుకే పనిచేస్తూ పయనిద్దాము, ఫలితము దైవానికే !!
కామెంట్‌లు