కొయ్యగుర్రం ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చల్ చల్ గుర్రం 
చలాకి గుర్రం
కొయ్యా గుర్రం
నా ఆట గుర్రం 
మేత లేకున్నా
కోపగించదులే
నా కొయ్యగుర్రం 
రోజంత నడిపినా
అలసిపోదులే
నా కొయ్యగుర్రం
ఎంత సేపు కూర్చున్నా
పడదోయదులే
నా కొయ్యగుర్రం
నేనెక్కే గుర్రం
నా కొయ్యాగుర్రం
నాకెంతొ ఇష్టం 
నాకెంతొ ఇష్టం !!

కామెంట్‌లు