సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 వారధి... సారథి*
   *****
మనం సాహసోపేతంగా ముందుకు నడవడానికి , రేసు గుర్రంలా దౌడు తీయడానికి కావాల్సింది ముళ్ళు రాళ్ళూ లేని వారధి. మనం అనుకున్న లక్ష్యాన్ని సునాయాసంగా చేర్చేందుకు ఓ సారధి.
అవి రెండూ ఎక్కడో లేవు.  మొక్కవోని దీక్షతో సాగే  మన మనసే సారథి. గెలుపు సంతకం చేసేందుకు మనల్ని ముందుకు నడిపించే  అచంచలమైన విశ్వాసం, అంతకు మించి పట్టుదలే  విజయాలకు వారధి.
ఎన్నో అనుకుంటూ ఉంటాం సాధనలో వైఫల్యాలను చవి చూస్తూ ఉంటాం.
కారణం మనపై మనకు నమ్మకం ,పట్టుదల లేక పోవడం, తగినంత కృషి చేయక పోవడమే. పట్టు పడితే ఉడుం పట్టులా ఉండాలి.ప్రవాహానికి తట్టుకుని నిలబడే గడ్డిపోచలా మనో నిబ్బరం ఉండాలి.
మనసును సారథిగా చేసుకుని ప్రగతికి వారధి వేసుకుందాం. సాటివాళ్ళు ఆశ్చర్య పోయేలా  సమాజంలో విజయపథంలో దూసుకు పోదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు