బలే పద్యం; -- యామిజాల జగదీశ్
 ఇంగ్లీషు మాటలను ప్రయోగిస్తూ ఓ ఆసక్తికరమైన పద్యాన్ని ఏరిన ముత్యాలు అనే పుస్తకంలో చదివాను. సాహిత్య సాగరంలో ఏరిన ముత్యాలు అనే శీర్పికతో వెలువడిన పుస్తకమిది. వీటిలోని పద్యాలను భాషాప్రవీణ టి.వి.కె. సోమయాజులుగారు సేకరించారు. ఈయన తణుకువాసులు. బెంగుళూరులోని శ్రీరస శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య ఈ పుస్తకాన్ని 2006లో ప్రచురించింది. పుస్తక ప్రచురణకర్తలు ప్రొఫెసర్ టి.వి. సుబ్బారావుగారికి ధన్యవాదాలు. 
ఇక పద్యం విషయానికొస్తాను.
ఈరోజుల్లో కొందరు యువకులు బాధ్యతారహితంగా ఎలా ఉంటున్నారంటూ వారి లక్షణాలను కవి ఓ సీసపద్యంలో వ్రాసాడు. కవి ఎవరో తెలీదు కానీ పద్యం బాగుంది. ఒకటి రెండు మాటలు తప్పిస్తే పద్యంలోని మాటలన్నీ ఇంగ్లీషు మాటలే. బలేగుంది చదువుతుంటే.
---------
పద్యం శీర్షిక "మోడరన్ లివింగ్!
----------
సీ. 
సందులో శ్టాండింగు సతులకై వెయిటింగు
       మోడరన్ డ్రస్సింగు పోజ్ గివింగు!
సిగరెట్సు స్మోకింగు - సినిమాస్కు గోయింగు
        ఫ్రెండ్సుతో మూవింగు వాండరింగు!
ఇరిటేటు మైండింగు హిప్పీసు కట్టింగు
         రెక్కులెస్సు టాకింగు రీజనింగు!
కోయిన్సు స్పెండింగు గుడ్నాట్టు హియరింగు!
          రెఛడుగా హెడ్ స్ట్రాంగు రిప్లయింగు!
తే. విలను పోజింగు తండ్రికి వేవరింగు
తల్లి ఫియరింగు కార్యసాధన నథింగు
భవ్యవైఖరి తమ్ముళ్ళు ఫాలొయింగు
రాంగు గోయింగు ఈ మోడరన్ లివింగు!!

కామెంట్‌లు