క్రైనమ్ లేటిఫోలియమ్డా;.. కందేపి రాణీప్రసాద్.

 మా ఇంటి ఆవరణలో పెరుగుతున్న ‘ వైన్ లిల్లీ ‘ అనే పూల మొక్కను పరిచయం చేస్తున్నాను. ఇది పుష్పించే మొక్క ఇది జూన్ నుంచి ఆగస్టు దాకా పుష్పిస్తుంది. అది వాన వచ్చినపుడు మాత్రమే పుష్పిస్తుంది. ఆ తరువాత అంత ఖాలీ అకులతోనే ఉంటుంది. భూమి లోపల ఉన్న దుంప ఆధారంగా మొలకెత్తుతుంది. 22 సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చింది. ‘ అమరిలిడేసి ‘ కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం ‘ క్రైనమ్ లేటిఫోలియమ్ ‘ అంటారు.
ఈ మొక్కలు ఆసియా, ఇండియా, శ్రీలంక, వెస్ట్ ఇండీస్ లలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా అలకంకరణకు వాడతారు.వీటి పూల కాడలు లావుగా పొడవుగా పెరుగుతాయి. నాలుగైదు పువ్వులు ఒకేసారి మొగ్గలు వేసి గుత్తులుగా పూస్తాయి. వీటిలో తెలుపు, గులాబీ రంగుల్లో పువ్వులు పూస్తాయి. మా ఇంట్లో తెల్లని పువ్వులు మొక్కలు మాత్రమే ఉన్నాయి. వసంత, హేమంత ఋతువుల్లో మాత్రమే పువ్వులు ఎక్కువగా పూస్తాయి. భూగర్భంలో ఉన్న బల్బ్ ద్వారానూ, పువ్వులు నుంచి వెలువడ్డ విత్తనాల ద్వారానూ వేరే మొక్కలు పుడతాయి. పెద్దవైన పొడుగాటి ఆకులతో, సుందరమైన పువ్వులతో పొదలో పెరిగే ఈ మొక్క మనోహరంగా ఉంటుంది. ఆకులు గుబురుగా కుండికి నిండుగా ఉంటాయి. దాదాపు మీటరు పొడుగున్న కాడాకు పువ్వులు సమూహంగా పూస్తాయి. రెండు మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. సరళమైన పొడవు ఆకులతో తెల్లని తెలుపుతో పువ్వులు ఎకనాభిగాఅమర్చబడి ఉంటాయి. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఈ మొక్కలున్న కుండిలను నీళ్ళు పొయ్యక పక్కన ఉంచినప్పటికీ మట్టి అడుగున ఉన్న దుంప చనిపోలేదు. మరల నీళ్ళు ఇవ్వటం ఆరంభించగానే ముదురాకు పచ్చ ఆకులు పొడవుగా పెరగటం ఆరంభించాయి.
వీటిలో దాదాపుగా 180 జాతులు ఉంటాయి ఉద్యానవనాల అలంకరణ చెట్లుగానూ, పూలబోకేల్లో పెట్టె పువ్వులుగానూ వాడతారు. స్పైడర్ లిల్లీ, ట్రంపెట్ లిల్లీ, స్వాంప్ లిల్లీ అని రకరకాల జాతుల లిల్లీలు ఉంటాయి ఆయుర్వేదంలో ఈ మొక్కను ‘ సుదర్శన ’ అని అంటారు. ఆయుర్వేద సాహిత్యంలో నెప్పి పుట్టించే వాపులకు ఈ మొక్కలను వాడ వచ్చని చెప్పబడింది. కొన్ని రకాల జ్వరాలు, చర్మ సమస్యలు, వంటి సమస్యలకు పనిచేస్తుందని 5000 BC కాలంలో చెప్పబడింది. భావప్రకాశ్, సోమవల్లి, మధు పామిక, చక్రవాహ అనే పేర్లు సుదర్శన మొక్కకు సంస్కృతంలో ఉన్నవి. హిందీలో దీన్ని చిండర్, కన్వర్, పిండర్, బరాకన్వర్ అనే పేర్లతో పిలుస్తారు. కన్నడంలో దీనిని ‘ విష మంగ్లి ‘ అని, తమిళంలో ‘ విష పుంగిల్ ‘ అని, బెంగాలీ లో ‘ బడా కనోడ్ ‘ అని, ఉర్దూలో ‘గడంబి కండా ‘ అని అంటారు. తెలుగులో ఈ మొక్కను చాలా మంది ‘ కేసర చెట్టు’ అంటారు. వేర్లు, ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఔషదంగా ఉపయోగిస్తారు. 
కామెంట్‌లు