ప్రాణదాత; - : సి.హెచ్.ప్రతాప్
 వెంకటాపురంలో బ్రహ్మయ్య దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు. బ్రహ్మయ్యకు రెండెకరాల పొలం వుంది. దానిని జాగ్రత్తగా సాగు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తుండేవాడు. ఆడంబరాలకు, భేషజాలకు పోకుండా ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవిస్తున్నా, కొడుకులకు మాత్రం మంచి చదువు చెప్పించి వారిని వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేసాడు.
వారికి ఇంటి పని, పొలం పనులలో సాయం చేసేందుకు వీరన్న అనే పని వాడు ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రి నుండి వారసత్వం సంక్రమించిందా అన్నట్లు పాలెగాడు పనిలో వీరన్న బ్రహ్మయ్య ఇంట్లో కుదురుకున్నాడు. పొలం పనులతో పాటు ఇంటి పనులలో ఎంతో చేదోడు వాదోడుగా వుండేవాడు. అయితే బ్రహ్మయ్య భార్య లక్ష్మమ్మకు వీరన్న పొడ గిట్టేది కాదు. తక్కువ కులంలో పుట్టడం తో పాటు వీరన్నకు రాక్షస ఆకలితో పాటు శుచి శుభ్రత చాలా తక్కువ. ఒకటికి పది సార్లు చెబితే గాని శుభ్రంగా ఉండేవాడు కాదు.
తెల్లవారుజామునే లేచి, కాల కృత్యాలు తీర్చుకొని,స్నానపానాలు ముగించుకొని పూజ చేసుకుంటే గాని పచ్చి గంగైనా ముట్టని లక్ష్మమ్మ ఎప్పుడు అశుభ్రంగా వుండే వీరన్నని చూసి చీదరించుకునేది.అయితే అన్ని పనులు ఎంతో ఓపికగా చేస్తాడన్న కారణంతో వాడిని భరిస్తూ వుండేది. అమ్మగారికి ఎదురు పడకుండా తిరుగు అని బ్రహ్మయ్య వీరన్నకు చెబుతూ వుండేవాడు.
ఒక సందర్భంలో బ్రహ్మయ్య కొడుకులతో కలిసి పట్నం వెళ్ళాడు. మూడు నాలుగు రోజుల వరకు రాము కాబట్టి ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని వీరన్నకు మరీ మరీ చెప్పి వెళ్ళాడు. ముఖ్యంగా అమ్మగారికి అనవసరంగా ఎదురు పడడం,ఆవిడకు కోపం తెప్పించే పనులు చేయడం వంటివి చేయకుండా జాగ్రత్తగా వుండమని  మరీ హెచ్చరించాడు. అలాగేనని తలూపాడు వీరన్న.
మర్నాడు వంటింట్లో పని చేసుకుంటూ వుండగా కింద పడిన నీళ్ళను చూసుకోకుండా అడుగులు వేసిన లక్ష్మమ్మ కాళ్ళు సర్రున జారాయి. వేగంగా వెళ్ళి గోడకు కొట్టుకుంది. తలకు అక్కడ వున్న తిరగలి తగులుకోవడం తో పెద్దగా దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు లక్ష్మమ్మ కళ్ళు బైర్లు కమ్మాయి. అమ్మా అంటూ ఆర్తనాదం చేసి స్పృహ తప్పి పడిపోయింది. రక్తం ఎగజిమ్మి ధారలుగా కారసాగింది.
దొడ్లో తోట పని చేస్తున్న వీరన్నకు లక్ష్మమ్మ అరుపు వినిపించి పరిగెత్తుకు వచ్చాడు.రక్తపు మడుగులో పడున్న ఆవిడని చూడగానే అతగాడికి కాళ్ళు చేతులు వణికాయి. వంటగదిలోకి తను అసలు రావచ్చో లేదో ? మడిలో  వున్నప్పుడు ముట్టుకోవచ్చునో లేదో ? లాంటి అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే కర్తవ్యం స్పురణకు వచ్చి వెంటనే ఆవిడను లేవనెత్తి తలకు గుడ్డ కట్టి భుజం మీద వేసుకొని, ఇంటి బయట వున్న రిక్షాలో కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.
డాక్టర్లు అత్యవసర చికిత్స చేసి చాలా రక్తం పోయింది కాబట్టి రక్తం వెంటనే ఎక్కించాలన్నారు. ఆవిడకు బ్లడ్ గ్రూప్ పరీక్ష చేసి ఫలానా బ్లడ్ గ్రూప్  అర్జంటుగా కావాలన్నారు. ఆవిడది అరుదైన బ్లడ్ గ్రూప్. సాధారణంగా దొరకదు. రక్తదాతల వివరాలు ఆసుపత్రులలో నమోదు చేయబడి వుంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వారిని సంప్రదించి రక్తం సేకరించడం జరుగుతుంది.
డాక్టరు నర్సుతో వీరన్న బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చెయ్యమని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయేలా వీరన్న గ్రూప్ లక్షమ్మ గ్రూప్ సరిగ్గా సరిపోయాయి. వెంటనే వీరన్నకు అన్ని పరీక్షలు చేసి రక్తం సేకరించి లక్ష్మమ్మకు ఎక్కించారు. అంతటితో భగవంతుడి దయ వలన ఆవిడకు ప్రాణాపాయం తప్పింది.
మధ్యాహ్నానికి ఆవిడకు తెలివి వచ్చింది. ఆవిడను పరీక్షించాక డాక్టర్లు సంతృప్తి చెందాడు." నా ప్రాణాలు నిలిపినందుకు ధన్యవాదాలు. వైద్యో నారాయణో హరి: అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్ధమయ్యింది. నా మటుకు మీరే నా దేవుడు" అంటూ డాక్టర్ కు కన్నీళ్ళతో చేతులు జోడించింది  లక్ష్మమ్మ.
డాక్టర్ చిరునవ్వుతో " మీ పాలిట దేవుడు వీరన్న గాని నేను కాదు. సమయానికి సమయస్పూర్తి ప్రదర్శించి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకురావడమే కాకుండా మీకు రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడాడు. ఏ జన్మ ఋణమో మీ ఇద్దరిదీ. ఎక్కడో పుట్టిన మీ ఇద్దరిదీ ఇప్పుడు రక్త సంబంధం అయ్యింది" అని అన్నాడు.
ఆ మాటలకు విభ్రాంతితో చూసింది లక్ష్మమ్మ.జరిగిన విషయం అర్థమయ్యే సరికి అమెకళ్ళ ముందున్న అజ్ఞానపు పొరలు విడిపోయాయి. తక్కువ కులం లొ పుట్టినవాడు, శుచి శుభ్రత లేనివాడని అసహ్యించుకున్న వీరన్న తనను ఆపద నుండి రక్షించడమే కాకుండా రక్తం కూడా ఇచ్చి ప్రాణాలు నిలిపాడు. ఇప్పుడు తనలో ప్రవహిస్తొంది అతగాడి రక్తమే. ఇన్నాళ్ళు అతడిని అసహ్యించుకున్న వైనం గుర్తొచ్చి కన్నీరు వరదలా కారింది.అపరాధ భావంతో వీరన్న రెండు చేతులు   అందుకొని కళ్ళకు అద్దుకుంది.

సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం