తేటగీతి గర్భ ఆటవెలది;-మచ్చ అనురాధ
 తేటగీతి.
విద్య కన్న నిలన వేరె విలువ లేదు
తెలుసుకొన్న మనిషి తేటతెలివి నందు
బాగు పడును బ్రతుకు భావిభవిత జూడ
మరువరాదు నెపుడు మంచిమనసునందు 
ఆటవెలది
విద్య కన్న నిలన వేరెవిలువ లేదు
తెలుసు కొన్న మనిషి  తేటతెలివి 
బాగు పడును బ్రతుకు భావిభవిత జూడ 
మరువ రాదు నెపుడు మంచి మనసు


కామెంట్‌లు